అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్:
ప్రజా చైతన్య యాత్రలలో (జన జాగరణ) కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలా ప్రజా వ్యతిరేక విధానాలు, మరియు ధాన్యం కొనుగోలు, స్థానిక అంశాలపై సుల్తానాబాద్ మండల తహశీల్దార్ కి వినతిపత్రం ఇచ్చిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి ఆత్యంత దయనీయంగా మారింది అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతలు మాది కాదు అంటే మాది కాదు అంటూ పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరిసాగు అయ్యిందని ప్రభుత్వం చెబుతోందని. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో 23 పంటలతో పాటు వరి పంట కూడా ఉంది..మద్దతు ధర ప్రకటించడం అంటేనే ప్రభుత్వం కొనుగోలు చేయడం అని అర్థం. అందువల్ల రైతులు పండించిన వరి ధాన్యం పంటలను ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, అని కానీ రాష్ట్రంలో పంట ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేవుముందస్తు ప్రణాళిక లేకుండా,ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని పంట చేతికి వచ్చి నెల రోజులు అవుతున్న ప్రభుత్వం కేవలం 11 లక్షల క్విటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది అని రాష్ట్రంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా 6,772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా కేవలం 4, 743 కేంద్రాలు పేరు కు ఓపెన్ చేశారు.. ఇందులో సగం కూడా కొనుగోళ్లు చేయడం లేదు. అని లక్షల క్వింటాళ్ల ధాన్యం నేడు కల్లాలల్లో, రోడ్లపైనే ఉండి పోయి వర్షానికి తడిసి పాడైపోయింది. అలాగే ధాన్యం వరదలకు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోల్లలో జాప్యం, వరదల నష్టాల తదితర సమస్యలతో అన్నదాతలు గుండెపోట్ల తో కొందరు, ఆత్మహత్య లు చేసుకొని కొందరు, పాము కాట్లతో అసువులు బాసారు. స్వయంగా మంత్రి కేటీఆర్ నియోజక వర్గంలో నిన్న ధాన్యం వర్షంలో కొట్టుకుపోవడంతో ఎల్లారెడ్డి పేట మండలం అక్కపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అని మిల్లర్ల దోపిడీకి రైతులు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తూకం పట్టి ఆధారంగా రైతులకు డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయగానే వీరికి సకాలంలో డబ్బులు చెల్లించాలి. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. రాబోయే రోజుల్లో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసి ధాన్యం రైతులకు భరోసా కల్పించాలని, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని విజయ రమణారావు అన్నారు.ఈ కార్యక్రమంలో అంతటి అన్నయ్య గౌడ్, మినుపాల ప్రకాష్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్ రావు,కాల్వల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, సాయిరి మహేందర్, మరియు గొట్టం మల్లయ్య,,చింతల రాజు,ఎండి రఫిక్,పన్నాల రాములు,, సిద్ద కనకయ్య,, అమిరుశెట్టి రాయలింగు,అన్నేడి భాస్కర్ రెడ్డి,కుమార్ కిషోర్ తిరుపతి,మేకల పోచాలు, మోబిన్ తదితరులు పాల్గొన్నారు.
