అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్:

కరెంటు మోటార్లు దొంగతనం పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.
సుల్తానాబాద్ ఎస్ ఐ ఉపేందర్ రావు,వెల్లడి.
నాలుగు కరెంటు మోటార్లు, మోటార్ సైకిల్ స్వాధీనం..

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు,.సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, చెరువు కట్ట ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై ఒక కరెంటు మోటార్ తో అనుమానాస్పదంగా కనిపించడంతో, అతన్ని పట్టుకుని విచారించగా, అతని పేరు వడ్ల కొండ యాదగిరి గౌడ్, చిన్న బొంకూరు ,అని తెలపడం జరిగింది. సదరు వ్యక్తిని , మోటార్ సైకిల్, కరెంటు మోటార్ తో సహా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించి విచారించగా చిన్న బొంకూర్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నానని, వ్యవసాయం చేసుకోగా వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు, జల్సాలకు సరిపోవడం లేదని, అప్పులు బాగా అయిన వేరే పని చేయలేక సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంలో, వ్యవసాయ భూమిలో ఉండే కరెంట్ మోటర్లు దొంగతనం చేసి, 4,5 మోటర్లు జమ అయ్యాక, వాటిని అమ్మాలని ఉద్దేశంతో ,4 మోటార్స్ ను దొంగతనం చేసి, తన మోటార్ సైకిల్ పై ఒక కరెంటు మోటార్ పట్టుకొని వస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందని SI ఉపేందర్ రావు తెలిపారు . దొంగతనం చేసిన వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న PC S నాయక్ అశోక్ , తిరుపతి, విష్ణువర్ధనరెడ్డి, సదానందం లను ఎస్ ఐ ఉపేందర్ రావు అభినందించారు.