అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
జిల్లా రవాణా కార్యాలయం, పెద్దపల్లిలో
బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి P.రంగారావు అధ్వర్యంలో జిల్లా రవాణా కార్యాలయంలో నిర్వహించినటువంటి వేలంపాటలో 26 మంది వేలంపాటలో పాల్గొన్నారు. జిల్లాలోని జప్తు చేయబడి విడుదల కాకుండా ఉండి తుక్కుగా మారిన 39 వాహనాల ద్వారా ప్రభుత్వానికి ₹. 3,97,660/- ఆదాయం చేకూరిందని జిల్లా రవాణా అధికారి. రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ జె. ఉమా మహేశ్వర రావు, అల్లే శ్రీనివాస్, రవికుమార్ MVIలు, AO అరుణ ప్రతాప్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
