✍️✍️:వోల్లాల  జలంధర్ గౌడ్.

అగ్నిధార న్యూస్, కరీంనగర్ క్రైమ్:

రోడ్డు ప్రమాదంలో ఈ.ఈ. సహా నలుగురి మృతి పట్ల వినోద్ కుమార్ దిగ్భ్రాంతి.

కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. శ్రీనివాస్ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఈ.ఈ. శ్రీనివాస్ రావుతో పాటు మృతి చెందిన మరో ముగ్గురి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.