అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

హైదరాబాద్ లో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.భవిష్యత్తు తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలంగాణ మాక్ అసెంబ్లీకి. పెద్దపల్లి మండలం గుర్రం పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు  రామగుండం నియోజకవర్గ MLA గా ఎంపికై ప్రజల పక్షాన  వివిధ అంశాల పైన   తెలంగాణ మాక్ అసెంబ్లీలో  మాట్లాడారు. హైదరాబాదులో 72 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.కోమటిపల్లి రాజేందర్ ఒకరోజు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించడానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో రాజేందర్ నిరుద్యోగ సమస్య , వైద్యం, విద్య , రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రైతు సమస్యలు మొదలగు సమస్యలపైన మీద సుదీర్ఘంగా మాట్లాడారు .