అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

ఈ రోజు “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై  రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు,ఈ సంధర్భంగా ఆయన  మట్లాడుతూ గత 30 రోజులుగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్లే వరి కొనుగోళ్ల సెంటర్లకు రిబ్బన్ కట్ చూస్తూ వెళ్తున్నాడు తప్ప వరి ధాన్యం త్వరతగతిన కొనుగోలు జరిగేలా వ్యవసాయ అధికారులను అప్రమత్తం చెయ్యకపోవడం,ఎమ్మెల్లే అలసత్వానికి,అసమర్ధతకు నిదర్శనం అని విమర్శించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న టిఆర్ఎస్ పార్టీ లు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ పాలకులకు అధికార దాహం తప్ప ప్రజా రైతాంగ సంక్షేమం పట్ల ధ్యాస లేదన్నారు.గతంలో కాంగ్రెస్ ఫ్రభుత్వం అధికారంలో ఉన్నపుడు తడిచిన ధాన్యాన్ని ,మొలకెత్తిన రంగు మారిన ధాన్యాన్ని గింజ కోతలు పెట్టకుండా కొనుగోలు చేశామన్నారు.కొత్తగా ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చి రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారని, ఇప్పటికయినా సకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం త్వరితగతిన కొనుగోలు చెయ్యాలిని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు ఎప్పుడు వరి ధాన్యం పండించవద్దని కొనబోమని ప్రకటించిన దాఖలాలు లేవని,కొనుగొలు చేసిన వరి ధాన్యం ఎగుమతి కాకపోయినా నష్టాన్ని భరించిందే తప్ప రైతులకు వరి ధాన్యము పండించవద్దని ఎపుడూ చెప్పలేదని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కడర్ల శ్రీనివాస్, భూతగడ్డ సంపత్,తాండూరి శ్రీమాన్, తూముల సుభాష్,గన్నామనేని తిరుపతి రావు, తీగల సతీష్ ,గుర్రాల వాసు ,కుడిక్యాల రమేష్, అరెపల్లి రఘు , ,సుధాకర్ రావు ,గణమనేని శ్రీధర్ ,దామ రమేష్, ,పదాల సంతోష్ , సంజీవ్ రావు, కిరణ్ రావు ,కరుణాకర్ రావు, హరీష్ రావు,సంపత్ రావు , సుధాకర్ రావు,.పొలుదాసరి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు