అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:

ఈరోజు కలెక్టర్ సంగీత సత్యనారాయణ తన  చాంబర్లో జాతీయ రహదార్ల నిర్మాణం కోసం భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ అంశం పై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టరెట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియలో భాగంగా భూ సర్వే త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామ స్థాయిలో భూసేకరణ ప్రక్రియ పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.పెద్దపల్లి జిల్లాలో 37.1 కిమి మేర ఉంటుందని, దీనికి గాను మంథని, రామగిరి , ముత్తారం మండలంలోని 16 గ్రామాల పరిధిలో 492 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ మార్గంగా 37 కిలొ మీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం మంజూరైందని, దీని కోసం 493 ఎకరాలు సేకరించాల్సి ఉంది అన్నారు. వీటిలో ఇప్పటికే 20.15కిలో మీటర్ల, 272.35 ఎకరాలకు పైగా భూ సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న భూ సర్వే పూర్తి చేసి త్వరితగతిన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని  సూచించారు. భూ సర్వే నిర్వహిస్తున్న సమయంలో క్షేత్రస్థాయిలో కొంత మంది రైతులు,భూ యజమానుల నుంచి అభ్యంతరాలు కలుగుతున్నాయని అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు తెలుపుతున్న రైతులు భూ యజమానులతో స్వయంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారి ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహ మూర్తి, జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషోర్ ఏడి భూసర్వే అశోక్,కలెక్టరేట్ సూపరెండేంట్ దత్తు ప్రసాద్, సందీప్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.