పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :ప్రపంచాన్ని గడగడలాడించిన కరోన వైరస్ తాకిడికి కోట్లాదిమంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆర్థిక మూలాల మీద కోలుకోలేని దెబ్బ తీసింది.అనేక మంది జీవితాలు అతలాకుతలం చేసింది. భారత్లో లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తత వల్ల అనేక నివారణ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రజలు మహమ్మారి బారినుండి తప్పించుకోలేక పోయారు. ఆంక్షల మధ్య ప్రజా జీవనం కొనసాగింది. మాస్కులు ధరించడం శానిటైజర్ వాడడం విందులు వినోదాలకు దూరంగా ఉండటం పాఠశాలలు మూసివేయడం గుంపులు గుంపులుగా తిరగకపోవడం ఈ విధంగా చర్యలు చేపట్టి వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాల ద్వారా కరోన వ్యాధి ని నియంత్రించగలినాము. ఈ క్రమంలో మరో ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు అనిపిస్తుంది . ఓ మైక్రాన్ అనే వ్యాధి ద్వారా మరోమారు ప్రపంచానికి విపత్తు తప్పేలా లేదు మరోమారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.      ఈక్రమంలో…………..మళ్ళీ ఊపందుకున్న RT PC R కరోన పరీక్షలు. పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో. ఒ మైక్రాన్‌తో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యా శాఖ అధికారులు మరోమారు ప్రజలందరికీ కరోన పరీక్షలు చేసేందుకు సంసిద్ధంగాఉన్నట్లు తెలుస్తుంది .  పెద్దపల్లి మండలం రాగినేడు పి ఎస్ సి లో గురువారం రోజున కరోనా పరీక్షలు చేస్తున్నటువంటి దృశ్యం అగ్నిధార కెమెరా కి కనిపించింది.ఈ కరోనా పరీక్షలు ల్యాబ్‌ టెక్నిషియన్‌ సిద్ధ మధు నిర్వహించారు.