అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల18న, సురభి శ్రీధర్ కు డాక్టరేట్ ప్రధానోత్సవం . పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన సురభి శ్రీధర్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేపడుతున్న సామాజిక సేవలను గుర్తించి సంస్థ చైర్మన్ సురభి శ్రీధర్ కు.ఆసియా వేదిక్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ డిసెంబర్ 18న అందుకోబోతున్నారు.
ఆసియా వేదిక్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్ అవార్డును ఆసియా వేదిక్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని హోసూరులో గౌరవ డాక్టరేట్ సురభి శ్రీధర్ కు ఇవ్వనున్నట్లు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ చైర్మన్, యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ అకుల రమేష్ తెలిపారు . శనివారం డాక్టరేట్ సంబంధించిన కన్ఫర్మేషన్ లెటర్ ను ఆకుల రమేష్, సురభి శ్రీధర్ కు అందించారు అని సురభి శ్రీధర్ తెలిపారు. ఈ అవార్డు ఎంపికకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తను చేసిన సేవను గుర్తించి.ఆకుల రమేష్ డాక్టరేట్ కు సిఫార్సు చేయడం జరిగిందని ,సురభి శ్రీధర్ అన్నారు.సురభి శ్రీధర్ కు డాక్టరేట్ రావడం పట్ల పలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో పాటు సంఘాల బాద్యులు హర్షం వ్యక్తం చేశారు.తను తెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించి ఈ డాక్టర్ రేట్ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ,అన్నారు.
