పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: గత కొన్ని రోజులుగా పెద్దపల్లి సీనియర్ జూనియర్ అడ్వకేట్లు పెద్దపల్లి పట్టణంలోనే శాశ్వత కోర్టులు ఏర్పాటు చెయ్యాలని, అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించాలని, కన్నాల లో కోర్టు స్థలం వద్దని ఆందోళన చేస్తున్నటువంటి విషయం విధమే ,ఈ క్రమంలో మంగళవారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని జూనియర్ న్యాయవాదులు కలిసి కోర్టు ప్రాంగణం కన్నాలలో కాకుండా పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలని జూనియర్ న్యాయవాదులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి వారితో మాట్లాడుతూ గతంలో పెద్దపల్లి పట్టణంలో అనువైన ప్రాంతం లభించక, కన్నాల లో స్థలం ఎంచుకోవడం జరిగిందని అన్నారు. మెజారిటీ న్యాయవాదులు కోర్టు కన్నాల లో వద్దని అనుకుంటే, వారి కోరిక మేరకు ప్రత్యామ్నాయ మార్గం కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. న్యాయవాదుల విజ్ఞాపనను ,ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే ని కలిసిన వారిలో న్యాయవాదులు ప్రశాంత్ పుట్ట రవికుమార్ సురేష్ బాబు రవీందర్ సురేందర్ పెద్దపల్లి బార్ అసోసియేషన్ మెంబెర్స్ పాల్గొన్నారు.
