కరీంనగర్ జిల్లా అగ్నిధారన్యూస్: సిద్దిపేట పట్టణంలో వేములవాడ కమాన్ సమీపంలోని న్యూ హైస్కూల్ వద్ద మంగళవారం రోజు బస్సులో పాపకు తల్లి జన్మనివ్వడంతో, 108 సిబ్బంది తల్లిని పాపను వేరుచేసి ప్రభుత్వ ఆసుపతకి తరలించిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది.హైదరాబాద్ నుండి ఆసిఫాబాద్ కు వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ఒరిస్సాకు చెందిన జయంతి తన భర్త గణేష్, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తున్నది. బస్సు వేములవాడ కమాన్ వద్ద న్యూ హై స్కూల్ వద్దకు చేరుకోగానే జయంతి పురిటి నొప్పులతో బస్సులోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. బస్సు డ్రైవర్, కండక్టర్ బానయ్య, గంగాధర్ లు 108కి సమాచారం ఇవ్వగా వారు బస్సు వద్దకు చేరుకున్నారు. ఈమ్ టి కిషన్, పైలెట్ కనకరాజులు ప్రయాణికుల సహకారంతో బస్సు నుండి స్ట్రక్చర్ పై జయంతిని 108 లో కి తీసుకొని వచ్చారు. తల్లి నుండి బిడ్డను వేరు చేసి, చిన్నారికి ప్రాథమిక వైద్య సేవలు నిర్వహించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.
