చెల్కల జితేందర్ యాదవ్
మంథని,అగ్నిధారన్యూస్: సింగరేణి లో నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలం పాట ప్రవేటికరణను నిరసిస్తూ INTUC మరియు ఇతర ట్రేడ్ యూనియన్లు కలిసి చేస్తున్న సమ్మె న్యాయపరమైనది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ,సింగరేణి లో నాలుగు బొగ్గు బ్లాక్ ల ప్రవేటికరణ ను వ్యతిరేకిస్తూ INTUC మరియు వివిధ ట్రేడ్ యూనియన్లు చేస్తున్న సమ్మెకు పూర్తిగా సంగీభావం తెలుపుతూ,సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్ ల ప్రవేటికరణ సరికాదు,నాలుగు బ్లాక్ లను ప్రవేటు కు కట్టబెడితే ఉరుకొం,ప్రవేట్ కు బొగ్గు గనులను అప్పగించడం సరికాదు,బొగ్గు బ్లాక్ ల ప్రవేటికరణ ఆపాలి,బొగ్గు బ్లాక్ ల ప్రవేటికరణ తో సింగరేని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు.ప్రవేటికరణ వలన కార్మికులకు ,ప్రజలకు తీవ్ర నష్ట జరుగుతుందికేంద్రం ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు గొడుగు పడుతూ ఆధాని అంబానీల దోపిడి దారుల జేబులు నింపడం కోసామె కేంద్ర ప్రభుత్వం ప్రవేటికరణ కు పుణుకున్నది అన్నారు.బొగ్గు గనుల ప్రమాదంలో చనిపోతే కోటి రూపాయల ఎక్సగ్రేషియా చెల్లించాలి. డిపెండెండ్ ఉద్యోగుల వయోపరిమితిని 35 నుండి 40 సంవత్సరలకు పెంచాలి.కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తు నియంత పాలన నడుపుతున్నారు, అన్నారు.సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనె వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
