పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జగిత్యాల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపు మాదే ధీమా వ్యక్తం చేశారు.
పెద్దపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లతో కలిసి పరిశీలించిన ఉమ్మడి కరీంనగర్ టీఆరెఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్.రమణ.
పెద్దపల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపు మాదేనని సంపూర్ణ మద్దతు మాకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
