పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలో గత కొద్ది రోజులగా  గ్రామము  విషజ్వరాలతో మంచం పట్టి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.ప్రధానంగా గ్రామంలో పారిశుధ్యం లోపమా, కలుషితమైన నీరు తాగడం వల్లనా అనే విషయంపై గ్రామంలో చర్చ జరుగుతుంది. విషయం తెలుసుకొని,గ్రామంలో శనివారం రోజున నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి  గ్రామాన్ని సందర్శించి విష జ్వరాల బారిన పడినవారిని ,వారి  కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా నల్ల పౌండేషన్, మరియు  కియా హాస్పిటల్ కరీంనగర్ సంయుక్తంగా  మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఇంటింటికి  వెళ్లి తగిన పరీక్షలు చేసి మందులు అందించడమే కాకుండా వ్యాధిగ్రస్తులకి పండ్లు (దానిమ్మ, ఆపిల్స్, పాలు బ్రెడ్) పంపిణీ కార్యక్రమం  చేపట్టారు.  ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు ,యువత పాల్గొన్నారు.