లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి, సీనియర్ సివిల్ జడ్జి డి. వరూధిని.
పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్:  శనివారం పెద్దపల్లి లోని కోర్టు భవనంలో నిర్వహించిన లోక్ అదాలత్   కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డి. వరూధిని  పాల్గొని ప్రసంగిస్తూ,గత 2 సంవత్సరాల కాలంగా కరోనా నేపథ్యంలో కోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కోర్టులపై భారం తగ్గించే దిశగా, చిన్నచిన్న సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. భార్య భర్తల సమస్యలు, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజమార్గంలో సామరస్యముగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు ఈ రోజు నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో SCJ 53 JCJ 224 కేసులు పరిష్కారం అయ్యాయి అన్నారు.ఈ కార్యక్రమంలో జునియర్ సివిల్ జడ్జి కె.రాణి, లోక్ అదాలత్ మెంబర్లు శ్రీ పతి సత్తయ్య,. బాదము రమేష్ ఆర్.వి.రమణారావు, AGP తిరుపతి రావు, బార్ అసోషియేషన్ సెక్రటరీ ఎల్.భాస్కర్  న్యాయ వాదులు పాల్గొన్నారు.