పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: జోనల్ విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల విభజన, స్థానికత అంశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు పిఆర్ టియు రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియారిటీతో పాటు కొత్త జిల్లా స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా వొలాద్రి జయేందర్ రెడ్డి(ఎస్ ఏ యూపీఎస్ ఐతరాజపల్లి), ప్రధాన కార్యదర్శిగా కూర శ్రీనివాస్(ఎస్ఏ జెడ్పిహెచ్ఎస్ పూసాల) ఎన్నికయ్యారు. జయేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు పాతూరి రాజిరెడ్డి, చొల్లేటి శ్రీనివాస్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెపాటి వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
