ప్రగతి లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలి::జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్ట మధు
పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో ప్రగతి లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో 1వ , 2వ , 4వ మరియు 7వ స్థాయి సంఘం సమావేశాలను నిర్వహించారు.
ఫైనాన్స్ & ప్లానింగ్ , గ్రామీణాభివృద్ధి ,విద్య & వైద్యం, పనులు పై జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి వాటి పరిధిలో జిల్లాలో జరుగుతున్న పనుల గురించి చర్చించారు. జిల్లా ప్రజాపరిషత్ ద్వారా అందిన నిధులు, వాటి వినియోగం, గ్రామాలలో చేపట్టిన పనుల పై చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కరొనా విపత్కర సమయంలో సైతం గ్రామాలకు ప్రతి మాసం నిధులను సకాలంలో విడుదల చేస్తుందని , సదరు నిధులు సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని, వాటిని వినియోగిస్తు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు, ప్రతి రోజు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నూతన పంచాయతి రాజ్ చట్టం ప్రకారం కనీసం 75% సంరక్షించాలని అన్నారు. జిల్లాలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి రెండు డోసులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా నూతన వెరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో పకడ్భందిగా చర్యలు తీసుకోవాలని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించాలని జడ్పీ చైర్మన్ సూచించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలొ కనీస మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగితన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఒ శ్రీనివాస్ , జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీధర్, జడ్పీటిసిలు రాంమూర్తి, తిరుపతి రెడ్డి,శారద, నారాయణ,కో ఆప్షన్ సభ్యులు యండి.సలామొద్దిన్, దివాకర్ ,ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గోన్నారు.
