తిరుపతి,అగ్నిధారన్యూస్: శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి మరియు ఎస్ వి ఆర్ ఆర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 69 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జండా వందనం చేసిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ .గిరిబాబు.ఈ సందర్భంగా.  వైద్య ఉద్యోగుల సమస్యల కోసం అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఐ టి యు సి అనుబంధంగా అలుపెరుగని పోరాటలు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేసిందని తెలియజేశారు. ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఉండి పదకొండవ పిఆర్సి, బకాయి ఉన్న ఐదు డి ఏ లు , సి పి ఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల ఒకటో తారీకు న జీతాల చెల్లింపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన బాట పట్ట వలసి వస్తుందని ఉద్యోగులు సమాయత్తం గా ఉండాలని కోరారు. పెన్షనర్లకు రావాల్సిన  పెన్షన్ బెనిఫిట్స్ జిపిఎఫ్ ,ఎపిజిఎల్ఐ ,గ్రాట్యుటీ, పెన్షన్ సత్వరమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్రాంచ్ కార్యదర్శి కేసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని పరిష్కారం కోసం ఉద్యోగులందరూ ఆందోళన బాట పట్టాలని తెలియజేశారు. ఐకమత్యమే మహాబలం అని ఐక్యంగా పోరాడితే సాధించినది అంటూ ఏమీ ఉండదని, 66వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రాంచ్ కోశాధికారి వీర కిరణ్ మాట్లాడుతూ ఉద్యోగుల పక్షాన ఉండి పోరాడి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ,పదోన్నతులు ఖాళీ పోస్టుల భర్తీకి ఏది మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ సాధించిందని ,వైద్య ఉద్యోగులు కోవిడ్ సేవల సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారని ముఖ్యమంత్రి  , అధికారులు కూడా ఉద్యోగుల పక్షాన ఉండి సహకరించారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కొరకు అప్కోస్ ఏర్పాటు చేశారని తెలియజేశారు.ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్లకు ప్రభుత్వ ము విడుదల చేసిన జీవో ప్రకారం 16 వేల వేతనం చెల్లించాలని  తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని  సెక్యూరిటీ గార్డ్స్ కి శానిటేషన్ వర్క్ కి పెండింగ్లో ఉన్న జీతాలు పి ఎఫ్ ,ఈఎస్ ఐ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాలసుబ్రమణ్యం భక్తవత్సలం, ఎం .వాసంతి, సురేంద్ర, కుమార్, లోకేష్, మురళి, పురుషోత్తం, మంజుల, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.