– ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక పుణ్య కార్యక్రమం.కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
బుధవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం MPDO కార్యక్రమం వేదికగా 23 మంది కి కళ్యాణ లక్ష్మీ రూ.23,02,668/- విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ……………………………………………………………….
జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం లో బుధవారం రోజున మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ .కళ్యాణలక్ష్మీ షాదీ ముబారక్ పథకంఅనేది ముఖ్యమంత్రి. కేసీఆర్ ఆలోచననుండి పుట్టినిరుపేదఆడ పడుచులకు పెద్దన్నయ్యలా, అండగాఉంటున్నారుఅన్నారు.TRS ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత , DCMS ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి MPP బాలినేని రాజమణి, జడ్పీటీసీ బాదినేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
