పెద్దపల్లి అగ్ని ద్వారా న్యూస్ పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలను అంగన్వాడి టీచర్ కలవేన శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్ర చిన్నారులతో కలిసి  కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి రోజు ఆట పాటలతో పాటు చదువు చెప్పడమే కాకుండా అప్పుడప్పుడు   ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలలో నూతనోత్తేజాన్ని పెంపొందించినట్లు అవుతుందని పేర్కొన్నారు. చిన్నారులు  అంగన్వాడి కేంద్రానికి  రావడానికి ఏమాత్రం భయం లేకుండా వచ్చి ఆటపాటలతో చదువుకోడానికి  దోహదపడుతుంది అనే ఉద్దేశ్యంతొ కేక్ కట్ చేసి పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషన్ రెడ్డి  అన్వర్ అంగన్వాడీ ఆయా రామ ,పెనుగొండ శ్రీనివాస్ ,చిన్నారులు  పాల్గొన్నారు.