పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగూడూర్ లో క్షణికావేశంలో బంధాలు బాంధవ్యాలు మరిచి కన్న కొడుకుని హత్య చేసిన సంఘటన జిల్లాలో కల కలం సృష్టిస్తుంది. ఈ విషాద సంఘటన కుక్కల గూడూరు  గ్రామానికి చెందిన మేడం శంకరయ్య తన కుమారుడు మేడం రాజ్ కుమార్ ను కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.కన్న కొడుకును  కన్న తండ్రే హతమార్చిన సంఘటన పలువురిని విస్మయానికి గురి చేసింది .రాజ్ కుమార్ ప్రతిరోజు మద్యం సేవించి తండ్రితోపాటు కుటుంబసభ్యులను దుర్భాషలాడుతూ   గొడవ  పెడుతూ ఉండేవాడని, మద్యం మత్తులో మరోసారి  రెచ్చిపోయిన రాజ్ కుమార్ ను తండ్రి శంకరయ్య కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  సంఘటన స్థలాన్ని  పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత నగర్ ఎస్సై మహేందర్ లు  చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.