జగిత్యాల,అగ్నిధారన్యూస్:గురువారం రోజు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లే గ్రామానికి చెందిన G. అంజయ్య గుండె సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న చికిత్సచేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఉండి, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి తన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి వివరించడం జరిగింది . మంత్రి కొప్పుల ఈశ్వర్ తక్షణమే స్పందించి 2 లక్షల LOCని గురువారం హైదరాబాద్ తన క్యాంపు కార్యాలయంలో అంజయ్య కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ. తమ బాధను చెప్పగానే వెంటనే పెద్ద మనసుతో రెండు లక్షల రూపాయలLOCని స్వయంగా తన చేతుల మీద ఇచ్చి ఆదుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
