జగిత్యాల,అగ్నిధారన్యూస్: రైతు భీమా పథకం దేశంలోనే అద్భుతమై పథకం.. ఎమ్మెల్యే సుంకె రవి శంకర్సంచారం చేస్తున్న చోటకు వెళ్లి రైతు బీమా ప్రొసీడింగ్ ను అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.కేవలం ముప్పావుగుంట (90గంజాల)స్థలానికి పాస్ పుస్తకం ఉన్నందున అందిన రైతు బీమా.కొడిమ్యాల మండలం నరసింహుల పల్లి గ్రామానికి చెందిన సంచార జాతి (గంగిరెద్దుల) చెందిన గంట లచ్చయ్య అనారోగ్యంతో చనిపోయారు.అతనికి ముగ్గురు ఆడపిల్లలు.వారి పేరుతో భూమి ఉండడంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఐదు లక్షల బీమాకు అర్హులు అయ్యారు.ఈ బీమా ప్రోసిడింగ్ ను వారు సంచారం చేస్తున్న గ్రామమైన చెప్యాల గ్రామానికి వెళ్లి లచ్చయ్య కుటుంబ సభ్యులకు బీమా ప్రోసిడింగ్ కాపీని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు.రైతు చనిపోతే రైతు కుటుంబ సభ్యులకు వారి ఇంటికి వెళ్లి భీమా ప్రొసీడింగ్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేయడం జరుగుతుంది కానీ విభిన్నంగా వారు సంచారం చేస్తున్న గ్రామానికి వెళ్లి భీమా పత్రాన్ని అందజేయడం విశేషం.ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే రవిశంకర్ ని అభినందించారు.అలాగే అప్పారావు పేట గ్రామానికి చెందిన బందారి రాజయ్య కుటుంబానికి రైతు బీమా ఐదు లక్షల ప్రోసిడింగ్ ను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ…రైతు భీమా పథకం చాలా అద్భుతమైన పథకం అని అన్నారు.సంచార జాతులకు చెందిన వారికి ఐదు లక్షలు రూపాయలు బీమా గా రావడం వారి కుటుంబానికి ఎంతో మేలు అని అన్నారు.ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి రైతు బీమా పని చేస్తుందని అన్నారు.గతంలో రైతు చనిపోతే కనీసం సహాయం చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రైతు బీమా ప్రవేశపెట్టడం ద్వారా అనేక కుటుంబాలు వీధి పాలు కాకుండా రైతు బీమా పని చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణ రావు వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎగుర్ల తిరుపతి, శేఖర్ రెడ్డి,MPTC మల్లారెడ్డి,తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, కొండగట్టు దేవస్థాన డైరెక్టర్ లింగా గౌడ్,రైతు సమన్వయ అధ్యక్షులు అంకం రాజేశం, నాయకులు నేరెళ్ల మహేష్, తిరుమలేష్, గంగుల మల్లేష్ యాదవ్,సర్పంచ్ తిరుపతి,స్వామి,రవి కుమార్, ఐతం గణేష్,అంజన్ కుమార్,కోలాపురం రమేష్ గుండు రాజు బైరి వెంకటి, సురేష్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
