పెద్దపెల్లి జిల్లా అగ్నిధార న్యూస్– దివ్యాంగుల సంక్షేమ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర సంక్షేమ  శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి మంత్రి పాల్గొన్నారు. దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు దివ్యాంగుల సంక్షేమ పై ప్రత్యేక శ్రద్ధ వహించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రూ.500/- దివ్యాంగుల పెన్షన్ ను రూ.3016/- పెంచి ప్రతిమాసం అందజేస్తున్నారని అన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని ఉద్దేశంతో వారికి అవసరమైన పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తుందని , పెద్దపెల్లి జిల్లాకు ప్రభుత్వం 274 ఉపకరణాలు సబ్సిడీపై పంపిణీకి కేటాయించిందని, వీటికోసం 194 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 130 దరఖాస్తులు ఆమోదించి ప్రస్తుతం 114 మందికి ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని, మిగిలిన వారికి సైతం త్వరలో ధ్రువీకరించి ఉపకరణాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 22 మంది దివ్యాంగులకు టీవిఎస్ జుపిటర్ వాహనాలు, 8 మంది లబ్ధిదారులకు లాప్టాప్ ,4 లబ్ధిదారులకు మొబైల్ ఫోన్  14 మంది దివ్యాంగ లబ్ధిదారులకు బ్యాటరీ వీల్చైర్ లను మంత్రి పంపిణీ చేశారు. పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన దివ్యాంగుల అందరికీ మోటార్ వాహనాలు, బ్యాటరీ వాహనాలు మొదలైన ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమత రెడ్డి,           జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,  ,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.