పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: సోమవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే, విజయరమణారావు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా నూతన కోర్టు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా వేరే చోటికి భవనం తరలింపు ఆపాలి అన్నారు . పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నెలకొల్పాల్సిన నూతన జిల్లా కోర్ట్ భవనంను కొంత మంది  ఉద్దేశపూర్వకంగా స్వంత లాభంకోసం వారి భూ స్థలాల కోసం జిల్లా కేంద్రంలో కాకుండా వేరే వద్దకి తరలించడం శోచనీయమన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని ప్రజలకు రవాణా,ఆఫీసు  సకల సదుపాయాలకు నిలయంగా ఉన్న ఆఫీసులను  కుట్రపూరితంగా కొందరు నేతలు కోర్ట్ తరలింపునకు వత్తాసు పలుకుతున్నారని అక్రమంగా తరలిస్తున్నారని దీని పైచర్యలుతీసుకోవాలని పెద్దపల్లి జిల్లాకలెక్టర్  వినతిపత్రం అందించామని మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ,ఎంపీ వెంకటేష్ నేత  తక్షణమే చొరవ తీసుకుని తరలింపును నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రజల,న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపాగాని సారయ్య గౌడ్,,భూతగడ్డ సంపత్, , సయ్యద్ మస్రత్, నేతట్ల కుమార్, తూముల సుభాష్  బొడ్డుపల్లి శ్రీనివాస్. సురేష్ గౌడ్   తదితరులు పాల్గొన్నారు