పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ : సోమవారం జిల్లా కేంద్రంలోని సి ఐ కార్యాలయంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గతంలో నేర చరిత్ర గలవారు సత్ప్రవర్తన తో వుండాలని సర్కిల్ లోని పెద్దపల్లి ,ధర్మారం ,బసంత్ నగర్ ,పోలీస్ స్టేషన్ల… పరిధిలోగల138మందిరౌడీషీటర్లు,సస్పెక్ట్,షీటర్లకు, కౌన్సిలింగ్,నిర్వహించారు.
ఈసందర్భంగాసీఐ,ప్రదీప్.కుమార్,రౌడీషీటర్ల,కిఅనేకసూచనలుచేశారు. గతంలోపలుకేసుల్లోనిందితులుగా ఉన్నవారు నేర ప్రవుత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనుకాడమని హెచ్చరించారు. మంచిగా జీవిస్తే భవిష్యత్తులో రౌడీ షీట్లు తొలగిస్తామని, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎస్సైలు రాజేష్, రాజ వర్ధన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
