పోలీస్ స్టేషన్ లో కరోనా పరీక్షలు
.. ఏసీపీ సారంగపాణి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణకోసం అహర్నిశలు,కృషిచేస్తున్నటువంటి పోలీసులకి వారి ఆరోగ్య భద్రత కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లోని పోలీస్ సిబ్బందికి పెద్ద పల్లి పోలీస్ స్టేషన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి సారంగ పాణి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున పెద్దపల్లిప్రజలందరూఅప్రమత్తంగాఉండాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది .
