పంట నష్టంపై నివేదికలు తయారు చేయండి వ్యవసాయ అధికారులకు ఆదేశం.
.. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా
.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి అగ్నిధార న్యూస్ శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల సందర్శించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో నేలకొరిగిన మొక్కజొన్న, మిర్చి, పసుపు పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట, కునారం, గంగారం, పెగడపల్లి, , శ్రీరాంపూర్, , పందిళ్ళ, మల్యాల.ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, ముప్పిడితోట, ర్యాకల్ దేవపల్లి, నర్సాపూర్, ఎలిగేడు, భూరహాన్ మియపెట్.జులపల్లి మండలంలోని కుమ్మరికుంట, అబ్బాపూర్, వడకపూర్, కాచాపూర్, తేలుకుంట, పెద్దాపూర్, ఓదెల మండలం లోని నాంశానిపల్లి, కొలనూరు,పెద్దపల్లి మండలం లోని మూలసాల గ్రామాలలో తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 1000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగి ఉంటుందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఒక్కసారిగా అకాల వర్షంతో నష్టం చేకూరడం బాధాకరమన్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టంపై నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ జెడ్ పిటి సి వంగల తిరుపతిరెడ్డి సర్పంచ్ బుర్ర మంగ సదానందం మండల వ్యవసాయ అధికారి నాగార్జున సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, పాల్గొన్నారు.
