పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య. అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి ): సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బూస్టర్ డోస్ తీసుకున్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ,కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరు తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవాలనీ పిలుపునిచ్చారు.కరోన మహామ్మరి ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్నదని తెలంగాణలో కూడా కరోన కేసుల పెరిగాయని ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో నమోదవుతున్న కరోన కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్లాలని,బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజెర్ వెంట ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని పిలుపు నిచ్చారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోన వైరస్ విజృంభించ కుండా అవగాహన కల్పించాలని సూచించారు.
