అగ్నిధార న్యూస్( పెద్దపల్లి )గురువారం రోజు సాయంత్రం పెద్దపల్లి పట్టణంలోని స్థానిక గుండం చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్ల తో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి  పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడం కోసం మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తామన్నారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాజిమీన్, సుల్తానా మొబిన్ ఖాదర్ ఖాన్ దేవరాజ్ రవి చంద్ర రెడ్డి జెడ్ పి టి సి లక్ష్మణ్ జూలపల్లి తదితరులు పాల్గొన్నారు