జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి  ఎస్ఐ రాజేష్ ,. రాజ వర్ధన్ లు .                                 

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ):సోమవారం  పెద్దపల్లి ఎస్ ఐ లు కె రాజేష్ ,రాజవర్ధన్ లు తుర్కకల మద్దికుంట గ్రామాన్ని సందర్శించి సమ్మక్క- సారలమ్మ  జాతర జరిగే స్థలాన్ని,సౌకర్యాలను ఏర్పాట్లను, పరిశీలించారు .ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర  ప్రజలందరూ అంగరంగవైభవంగా జరుపుకుంటారన్నారు. ఫిబ్రవరి నెలలో 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు 4 రోజులు  జరిగే ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర అన్నారు.ఈ జాతరకు వచ్చిపోయే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని జాతర కమిటీ చైర్మన్ కి పాలక వర్గానికి సూచించారు. వరంగల్ జిల్లా మేడారంలో జరిగే ఈ కుంభమేళా జాతరకు వెళ్లలేని భక్తులు స్థానికంగా ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరలకు పెద్ద ఎత్తున  వచ్చే అవకాశం ఉన్నందున కావలసిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలన్నారు. పెద్దపల్లి పోలీస్ శాఖ పక్షాన మండలంలో నిర్వహించే సమ్మక్క సారక్క జాతర ప్రదేశాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయన్నారు. జాతర కమిటీకి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో  కమిటీ చైర్మన్ శంకరయ్య, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య సంజీవ రెడ్డి, ఉపసర్పంచ్ జాన్, ఈదునూరి వెంకటి, సల్లు, మోగిలి తదితరులు పాల్గొన్నారు.