అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ):గురువారం శాసనమండలిలో జరిగిన 4 గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఎల్.రమణకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సౌమ్యుడు మృదుభాషి బడుగు బలహీన బలహీన వర్గాల ఆశాజ్యోతిL రమణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ చట్టసభల్లో అడుగుపెడుతున్న సందర్భం సంతోషాన్ని ఇస్తుందన్నారు. గతంలో లో రెండు చట్టసభల్లో పని చేసిన అనుభవం నేడు మూడవ చట్టసభల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినట్లు అయిందన్నారు.
అలాగే, ఈ సందర్భంగా టిఆర్ఎస్ జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యేలు కె.విద్యాసాగర రావు,కోరుకుంటి చందర్ లకు మంత్రి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.