మాజీ  ఎమ్మెల్యే కాల్వ రామచంద్ర రెడ్డి  వర్ధంతి వేడుకలలో ఎంపీపీ జడ్పిటిసి ఇతర నాయకులు.
అగ్నిధారన్యూస్(  కాల్వ శ్రీరాంపూర్ ):శనివారం రోజు కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాల్వ రామచంద్ర రెడ్డి 30వ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం ఆవరణలో   నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన నియోజకవర్గంలో చేసిన సేవలతో పాటు శ్రీరాంపూర్ మండలంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయాయని,పలువురు,ప్రజాప్రతినిధులుకొనియాడరు ఈ కార్యక్రమంలో , వైస్ చైర్మన్ కామెడీ సంధ్య వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ జెట్టి దేవేందర్, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.