అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన జిల్లా యాదవ సంఘం నాయకుడు,మారం తిరుపతి యాదవ్ సమాజ్ వాది పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో మారం తిరుపతి యాదవ్ ని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సింహాద్రి మాట్లాడుతూ మారం తిరుపతి యాదవ్ గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నే కాకుండా పెద్దపెల్లి జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రజలయాదవ కులసోదరుల సమస్యల సాధన కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా సేవలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్రస్థాయిలో ఈ అవకాశం కల్పించినందుకు సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సింహాద్రి యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టినందుకు పదవికి న్యాయం చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు . ఈ సందర్భంగా పలువురు యాదవ సంఘం నాయకులు మారం తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు.
