అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి  , మరియు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు,మంథని ఎంమ్మెల్యే శ్రీధర్ బాబు,పిలుపు మేరకు. శనివారం రోజుపెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై మన ఉద్యోగాలు మనం సాధించుకుందాం అనే నినాదం  నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావడం కోసం,రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇల్లు ముట్టడి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో ,ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలంటూ నిరుద్యోగ సమస్యను  ఆత్మహత్యలను  నిర్మూలించాలి అంటూ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. ఈ క్రమంలో పెద్దపల్లి  సి ఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ,ఎస్ ఐ లు సహదేవ్ సింగ్, మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో, నిరసన కారులను అరెస్టు చేసి పెద్దపల్లి ధర్మారం పోలీస్ స్టేషన్ల కి తరలించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెమిని గౌడ్ ,పూదరి చంద్రశేఖర్    మాట్లాడుతూ అరెస్టులతో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించ గలరా, ప్రజా వ్యతిరేకతను ఆపగలరా అన్నారు. రాష్ట్రంలో  జిల్లాలో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చుతుంది అన్నారు. రాష్ట్రంలో వేలాది  మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది అన్నారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి నోటిఫికేషన్లు వేయాలన్నారు .అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెల నెల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.          ……………………………………………….. ఈ కార్యక్రమంలో నరేష్   రంజిత్,  బండ శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, తిరుమలేష్,నరేష్, జెడల రాజు, మిట్టపల్లి శ్రీకాంత్, సయ్యద్ జుబేర్,రౌతు మనోజ్, సుమంత్ రెడ్డి, శ్రావణ్ కొలిపాక, అజయ్ మరియు …... పెద్దపల్లి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరగొండ రాజ్ కుమార్, యువజన కాంగ్రెస్ జూలపల్లి మండల అధ్యక్షుడు మానుమండ్ల శ్రీనివాస్,మహ౦కాళీ అంజయ్య,యువజన కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మతిన్,యువజన కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి చొప్పదండి నరేష్,ఇరుగాల ప్రభాకర్,వడ్లూరి చంద్రమౌళి,అమరగని సాయి,నెరువట్ల ప్రణయ్,న్యాతరి రవి,కోదాది ప్రశాంత్,హరీష్ తదితరులు పాల్గొన్నారు