టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి శాలువతో సన్మానం చేసిన దృశ్యం.

అగ్నిధారన్యూస్( ముత్తారం ): తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కి శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు . రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ నుండి ఆదిలాబాద్ జిల్లా వెళుతున్న  క్రమంలో  మంథని నియోజక వర్గం  ఓడేడ్ మానేరు వాగులో గ్రామస్తులు వేసిన రోడ్డు మార్గం మీదుగా మంచిర్యాల వెళ్లే క్రమంలో.విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఓడేడ్ లో ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి చంద్రమౌళి, పవన్ కళ్యాణ్ లతో పాటు కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు ఉన్నారు.