అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం రోజు పెద్దపెల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ రావుకి ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానం చేసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థులు, బండారి శ్రీనివాస్ మరియు పరిశోధక విద్యార్థులు మాట్లాడుతూ.…గురువును సన్మానించడం గర్వంగా ఉంది అన్నారు. నేటి ప్రపంచంలో ఎక్కడ చూసిన మోసాలు దగ కుట్రలు కుతంత్రాలతో రాజ్యమేలుతున్నాయి అన్నారు. కానీ ప్రపంచంలో మోసం చేయనిది ఒకటి ఉంది అంటే అది విద్యనే ఆవిద్యను బోధించిన గురువులందరికీ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు చదవడం నేర్పిన గురువులకు , సమాజాన్ని చదవడం నేర్పిన తల్లిదండ్రులకి జీవితాంతం రుణపడి ఉంటాము అన్నారు …… ఈ కార్యక్రమంలో డాక్టర్ వేల్పుల సురేందర్ , డాక్టర్ సాధిక్ పాష, తోట రమేష్, నరేష్, మోసెస్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
