అగ్నిధార న్యూస్:జగిత్యాల:అజాదికా అమృత్ మహోత్సవ్ మరియు స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో హర్ దడకన్ హై స్వచ్ఛ భారత్ హై లో భాగముగా టవర్ సర్కిల్ వద్ద డిజిటల్ స్క్రీన్ పై స్వచ్ఛత గేయమును,మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో పట్టణ ప్రజలు అందరూ పాల్గొని జగిత్యాల పట్టణమును స్వచ్ఛతలో ముందుంచాలని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరముల పరిశుభ్రత పాటించాలని స్వచ్ఛసర్వేక్షన్ 2022 లో ప్రజలందరు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో బల్దియా వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, పంబల రాము, కప్పల శ్రీకాంత్, కూతురు రాజేష్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….
