మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ): శనివారం రోజు ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడుఎలువాక వెంకటస్వామి  ఇటీవల అనారోగ్యంతో మరణించారు.  వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 20,000/- నగదు మరియు 2 క్వింటాళ్ల బియ్యం  పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు  చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు.  ఈ సందర్భంగా ఆయన మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు.చొప్పరి రాజయ్య, పుప్పాల శంకర్, ఎండి రఫీ, కసిరెడ్డి మహేందర్ రెడ్డి,ఉడిగే సదయ్య,జాగిరు కిషోర్ , తల్లపల్లి శ్రీనివాస్, రామగిరి రాజు, తల్లపెళ్లి శంకర్, మదుంయ్య, ఆదిబాపు రావు,నత్తరి శ్రీనివాస్, సాదిక్, దాసరి కుమార్, చింటూ అనీల్, తల్లేపల్లి మల్లేష్, జాగిరి అంజి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.