అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మూలసాల గ్రామ పరిధిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తెలిసిన వ్యక్తే కదా అని బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కత్తితో విచక్షణ రహితంగా పొడిచిన వ్యక్తి, ఈ సంఘటన పెద్దపల్లి మండలంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి మండలంలోని మూలసాల గ్రామంలో దాసరి కొమురయ్య అనే రైతు తన పొలం వద్దకు వెళ్లి పశువులకి పచ్చి గడ్డి కోసుకుని వస్తున్న క్రమంలో, మార్గమధ్యంలో
,అదే గ్రామానికి చెందిన దాసరి కొమురయ్య, ఇంటికి దగ్గరగా ఉండే కృష్ణసాయి,అనే వ్యక్తి లిఫ్ట్ అడిగి బైక్ మీద వెనకాల కూర్చున్నాడు. అలా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కృష్ణసాయి, ఒక్కసారిగా ఉన్మాదిగా మరి ? తన వద్ద ఉన్న కత్తితో దాసరి కొమురయ్య పై విచక్షణ రహితంగా వీపు పైన దాడి చేయడంతో ఒక్కసారిగా విస్మయానికి గురి అయిన కొమురయ్య తేరుకొని కృష్ణ సాయి నిలువరించే క్రమంలో, కృష్ణ సాయి తప్పించుకొని పరుగులు తీశాడు. బాధితుడిని తన కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కక్ష పూర్వకంగా కత్తితో దాడి చేశాడా, మద్యం మత్తులో ఘటన కు పాల్పడ్డా, మరేమైనా వివాదాలు ఉన్నాయా, అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
