అగ్నిధార న్యూస్ రామగుండం తర్వాత జిల్లా నదులపల్లి గ్రామానికి చెందిన దుర్గం మౌనిక- సాయి వివాహ వేడుకలకు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ సమతా సైనిక్ దళ్ మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులతో కల్సి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.అంతరం వారు మాట్లాడుతూ అమ్మ రామభాయి తండ్రి బాబాసాహెబ్ అంబేడ్కర్ల దివ్యాశిస్సులతో ఆయురారోగ్యాలతో , అష్ట ఐశ్వర్యాలతో ,సుఖ సంతోషాలతో పదికాలలపాటు చల్లగా వర్ధిల్లాలని ఆశించారు, నూతన దంపతులకు అంబెడ్కర్ భావజాలంతో ,బుద్ధుని మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాగే భూమయ్య, , దుర్గం విశ్వనాధ్, దుర్గం శివ ప్రసాద్, దొంగ్రే సాయి, దుర్గం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
