అగ్నిధార న్యూస్( పెద్దపల్లి )బుధవారం హైదరాబాదులో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గం, ఎలిగేడు మండలం, ముప్పిరితోట గ్రామానికి చెందిన ,నారగోని సునీత కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 3,00,000/- రూపాయల ఎల్వోసీ చెక్కును( నిమ్స్ హాస్పిటల్ ) తానే స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…. తెలంగాణ రాష్ట్రంలోని పేద ,అనార్యోగా ,బాధితులకు వరం సిఎం సహాయనిధి అన్నారు.అనార్యోగాల బారిన పడిన పేదవారికి కార్పోరేట్ ఆసుపత్రుల్లో శాస్త్ర, చికిత్సలు, మెరుగైన వైద్యం పొంది. ఆర్థికంగా నష్టపోయి ఉంటారు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం వారికి సిఎం సహాయనిధి ద్వారా అర్దిక భరోసా కల్పించండం జరుగుతుందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే గా తాను గెలుపోందిన నాటినుండి నియోజకవర్గంలోని చాలామంది పేద ప్రజల, అనారోగ్య బాధితులకు సి.ఎం.ఆర్.ఎఫ్ ద్వారా చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అఖిల భారత యాదవ మహాసభ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, మేకల మల్లేశం యాదవ్ పాల్గొన్నారు.
