అగ్నిధారన్యూస్( జగిత్యాల )జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 14 మంది ఆడపడుచులకు 14 లక్షల 16వందల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆదివారం రోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మేల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు అందజేశారు . …… . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, దేశానికి ఆదర్శవంతమైన పథకాలు అన్నారు. పేదింటి ఆడపడుచుల జీవితాలలో వెలుగు నింపే గొప్ప పథకాలు అన్నారు. ఆడపిల్లలకు మేనమామ కట్నంగా, ముఖ్యమంత్రి తీసుకువచ్చిన పథకాలు ఇవి అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్,మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు,సర్పంచులు ప్రభాకర్, స్వప్న ,రాజేశ్వర రెడ్డి, లక్ష్మణ్ రావు,ఎంపీటీసీ లు దమ్మ మల్లారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,అర్బన్ మండల రైతుబందు కన్వీనర్ జంబర్టి శంకర్,పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్,ఉప సర్పంచ్ బుచ్చిరాజం,జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులి నర్సయ్య,అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు ముతులాపురం శేకర్, డిటి రాజేందర్ రావు,అర్ఐ ఖజిం అలీ,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
