అక్రమ మట్టి తరలింపు ను అరికట్టాలి.

■  మిర్యాల  సురేష్ రెడ్డి ( మిరాల సురేష్ కుమార్ ) మైనింగ్ శాఖ కి ఫిర్యాదు

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామం సమీపంలో గల క్వారీల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ మిర్యాల సురేష్ రెడ్డి ( మిరాల సురేష్ కుమార్. ) మైనింగ్ ఏడికి సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. బొంపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న క్వారీలు అనుమతులకు మించి హై వోల్టేజ్ బ్లాస్టింగ్ ల వల్ల ప్రజలు శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అన్నారు. అదేవిధంగా బొంపల్లి మేరపల్లి గ్రామాలలో ఇండ్లు బీటలు వారుతున్నాయి అని ఆరోపించారు. కొన్ని క్వారీల నుండి యధేచ్చగా మట్టి రవాణా చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. క్వారీ నిర్వాహకులు నిబంధనలకు లోబడి కార్యకలాపాలు చేపడుతున్నారా ? నిబంధనలు అతిక్రమించి అక్రమంగా కార్యక్రమాలు చేపడుతున్నారా ? అని సంబంధిత ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇట్టి విషయమై మైనింగ్ శాఖ మరియు రెవెన్యూ శాఖ స్పందించి సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న క్వారీలపై కఠిన చర్యలు తీసుకొని బొంపల్లి ,మేరపల్లి గ్రామ ప్రజలను శబ్ద కాలుష్యం నుండి కాపాడాలన్నారు.