అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ) శనివారం ఉగాది పండగ రోజు సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధుల ద్వారా 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ని   ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు . అనంతరం ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి  స్వామివారికి  .ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…….. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు శుభ కృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సు:ఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో RSS జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి, ఎంపీపీ బాలాజి రావు,AMC చైర్మన్ బుర్ర శ్రీనివాస్, సర్పంచ్ జమున తిరుపతి,ఎంపీటీసీ ఏర్రం విజయ్, మాజీ సర్పంచ్ పోచమల్లు, గ్రామ పాలక వర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.