■  ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏ ఎం సి డైరెక్టర్. 

■  పాల్గొన్న ముస్లిం సోదరులు మత పెద్దలు.

■  పండుగలు మన జీవన స్రవంతిలో  ఒక భాగం.

■  మహోన్నతమైన దైవం మానవాళికి మార్గదర్శకత్వం ఆలేరు ఏఎంసి డైరెక్టర్ పత్తిపాటి మంజుల.

అగ్నిధారన్యూస్ (  యాదాద్రి జిల్లా )శుక్రవారం సాయంత్రం యాదాద్రి జిల్లా,ఆలేరు నియోజక వర్గం, తుర్కపల్లి మండల కేంద్రo లో ముస్లిం సోదరులకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్  పత్తిపాటి. మంజుల ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంజుల పత్తిపాటి మాట్లాడుతూ,……భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి సమాజం  అన్నారు. సర్వ మతాలకు నిలయం అన్నారు . దేశంలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఒక మతాన్ని మరొక మతం వారు గౌరవంతో ఉంటారన్నారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అన్నారు. పండగలు ఏవైనా  అందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు అన్నారు……పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా  దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం అని అన్నారు.రంజాన్ నెలలో మాత్రమే ఉపవాసం ఎందుకు ఉంటారంటే మహోన్నతుడైన దైవం మానవాళికి మార్గదర్శకత్వం కోసం ఖురాన్ అనే గ్రంథం అవతరింపజేశాడు అని, దానికి కృతజ్ఞతగా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష పాటించి దైవానికి కృతజ్ఞతగా ఉంటారు అని అన్నారు.ఈ సందర్భంగా ముస్లిం మతం పెద్దలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాటి  మంజుల కి కృతజ్ఞతలు తెలుపుతూ.. అల్లా చల్లగా చూడాలని దీవించారు. రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.