అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి )లైన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి విజన్ కేర్  వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది .ఈ సందర్భంగా పూదరి దత్త గౌడ్ ,డాక్టర్ అబ్దుల్ వాసే మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతి గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కంటి శాస్త్ర చికిత్సలు అవసరం ఉన్నా వారిని గుర్తించి శాస్త్ర చికిత్సల కోసం రేకుర్తి  మరియు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి శాస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి మండల ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు జరిగిన పరీక్షలలో  గ్లకోమా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించి వరంగల్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని డాక్టర్ అబ్దుల్ వాసే తెలిపారు.