■  గ్రంథాలయం చుట్టూ చిందరవందర గందరగోళం.

■  అసౌకర్యాలకు నిలయం పెద్దపల్లి జిల్లా గ్రంధాలయం.

■  గ్రంథాలయంలో కానరాని సౌకర్యాలు.

■  రణగొణ శబ్దాల మధ్య పోటీ పరీక్షలకు చదువు కొనసాగింపు.

■  వాష్ రూమ్ సౌకర్యం కల్పించని దౌర్భాగ్యం.

■  గ్రంథాలయం పై మున్సిపాలిటీ శీతకన్ను.

అగ్నిధారన్యూస్ పెద్దపెల్లిజిల్లా  జిల్లాలో ఉన్న పెద్దపల్లి ,మంథని ,రామగుండం, గోదావరిఖని, కమాన్ పూర్ ,జూలపల్లి ,ధర్మారం ,సుల్తానాబాద్ ,కాల్వ శ్రీరాంపూర్ ,ఓదెల,   మొత్తం పది గ్రంథాలయాలు ఉన్నప్పటికీ అరకొర వసతులతో గ్రంథాలయాల  నిర్వహణ కొనసాగుతుంది.   పెద్దపల్లిలోని డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ పేరుకు మాత్రమే పెద్ద లైబ్రరీ చూస్తే మాత్రం ఇరుకు గదిలో 20 ,30 కుర్చీలతో గ్రంథాలయ నిర్వహణ కొనసాగుతుంది.పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లైబ్రరీ కావడంచేత రోజుకు 150 నుంచి 200 రీడర్స్ ఉదయం సాయంత్రం  గ్రంథాలయానికి పాఠకులు వచ్చి న్యూస్ పేపర్ ,రీడింగ్ పుస్తక పఠనం చేస్తుంటారు. అరకొర వసతుల మధ్య ఏళ్ల తరబడి నిర్వహణ కొనసాగడం బాధాకరమైన విషయం. పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు అక్కడ రోజు పరీక్షే తెలంగాణ ప్రభుత్వం త్వరలో 80039  ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరుచనున్నoదున  జిల్లాలోని నిరుద్యోగ  యువతీ యువకులు చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉన్నత విద్యావంతులు డిస్ట్రిక్ట్ లైబ్రరీ వైపు చూస్తున్నారు. గ్రంథాలయంలో22371 వివిధ రకాల పుస్తకాలు ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు ఉపయోగపడే చాలీచాలని పుస్తకాల మధ్య  పరీక్షలకు   సన్నద్ధమవుతున్నారు. నిత్యం జిల్లా గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు( 30నుండి50 ) స్థానిక పెద్దపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ మండలాల నుండి  వచ్చి అరకొర వసతుల మధ్య చదువు సాగిస్తున్నారు.

శబ్ద కాలుష్యంతో చదవలేక పోతున్నారు.  గ్రంథాలయం అనగానే పిన్ డ్రాప్ సైలెన్స్  అనేది గుర్తుకు వస్తుంది. ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర   వాతావరణాన్ని పంచె విధంగా గ్రంథాలయం ఉండాలి. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో అవేవి కానరావడం లేదు కారణం పక్కనే ఉన్న మున్సిపాలిటీ కార్యాలయం మరోపక్క మున్సిపల్ కార్మికుల కార్యాలయం ఉండడంచేత నిత్యం కార్యాలయానికి వచ్చే సందర్శకుల చేత, వాహనాల రణగొణ శబ్దాలు, మున్సిపల్  కార్మికుల సందడి, మధ్య గ్రంథాలయంలో చదవడం  అనేది గగనంగా మారింది. ఉదయం సాయంత్రం వేళల్లో శబ్ద కాలుష్యం మరీ ఎక్కువగా ఉంటుంది.

శబ్దాలని భరించలేక విద్యార్థులు చాలా  సందర్భాలలో గ్రంథాలయ తలుపులు మూసి లోపల చదువుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.  అబ్బాయిలు తప్ప అమ్మాయిల కనిపించారు.    గ్రంథాలయానికి సొంత గది లేదు, ఉన్నది చిన్న గది కావడం చేత పోటీ పరీక్షల కోసం   గ్రంథాలయంలో అమ్మాయిలు  కూర్చుని చదువుకునే పరిస్థితులు లేకపోవడం గమనార్హం. ఒకవేళ వచ్చి చదువుకున్న అరగంట, గంట సమయం కంటే ఎక్కువగా  ఉండలేకపోవడం అక్కడున్న అసౌకర్యాలను చూపిస్తుంది. మరో ముఖ్య విషయం గంటల తరబడి కూర్చుండి చదువుకునే విద్యార్థుల కోసం కనీస వాష్ రూమ్  సౌకర్యం లేకపోవడం బాధాకరం. ఈ సందర్భంగా అనేక మంది విద్యార్థులు అగ్నిధార తో మాట్లాడుతూ….  గ్రంథాలయంలో కనీసం వాష్ రూమ్ సౌకర్యం లేకపోవడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం,టాయిలెట్ కోసం చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది అన్నారు. లైబ్రేరియన్ యూనిస్ ఖాద్రి నీ ఇట్టి విషయమై అగ్నిధార వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ టాయిలెట్ గది ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నీటి సౌకర్యం లేకపోవడం చేత వాష్ రూమ్  నిరుపయోగంగా ఉంటుందన్నారు.  పట్టణ మొత్తానికి నీరందించే మున్సిపాలిటీ వారు కార్యాలయం పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయ కార్యాలయానికి ఒక్క టాప్  కనెక్షన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. గ్రంథాలయం చుట్టూ చెత్తాచెదారం వాహనాల పార్కింగ్ తో ఎప్పుడు చూసినా అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గ్రంథాలయ సేవలు గ్రామాలకు విస్తరింప చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వెలువడనున్న దృశ్య ప్రతిరోజు గ్రామాల నుండి పెద్దపల్లి పట్టణానికి వచ్చి చదువుకోవడం పెద్ద సమస్య అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ లో సరైన వసతులు లేకపోవడం వల్ల ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో వి బి కే సెంటర్స్ ( విలేజ్ బుక్ కీపర్ కేంద్రాలను ) నెలకొల్పి పాఠకులకు వివిధ రకాల  పుస్తకాలు ,న్యూస్ పేపర్ ,నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను వి బి కె సెంటర్ లో ఉండేవిధంగా చూడాలి.