యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి.
పాల్గొన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు .
అగ్నిధారన్యూస్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సాక్షరభారత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఒకరోజు ధర్నా కార్యక్రమం హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద వేలాది మందితో కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు. సాక్షరభారత్ సమన్వయకర్తల కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి తిరిగి విధులలో తీసుకునేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే సాక్షర భారత్ సమన్వయకర్తల ను వీధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీరు విధుల్లోకి తీసుకోలేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అన్నారు.

