అగ్నిధారన్యూస్  ( పెద్దపల్లి. )గురువారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసం కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమవేశం ఏర్పాటు చేసి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ…..బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన తెరాస మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ని కాంగ్రెస్ పార్టీ భిక్షతో మంత్రి అయిన విషయం మర్చిపోయి రాహూల్ గాంధీ పైన కాంగ్రెస్ పార్టి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెరాస ప్రభుత్వంలో రైతులను రకరకాల మాటలతో గందరగోళ పరిస్థితి నెలకొల్పుతున్నారు అన్నారు. పత్తి పెట్టొద్దని ఒకసారి ,సన్న వడ్లు పండించాలని ఒకసారి ,మక్కలు పండించొద్దని మరొకసారి ,ఇపుడు వరి పంట పండించొద్దని చెపుతున్నారంటే రైతుల పట్ల ఈ ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెరాస ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నదో ప్రజలందరూ ఒకసారి గమనించాలి అన్నారు.రైతులకు మద్దతు ధర ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే అన్నారు .ఛత్తీస్ ఘడ్ లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన వరికి మద్దతు ధర కు 500 రూపాయల బోనస్ కలిపి పంట కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు.పెద్దపల్లి కి డి83,డి 86 కెనాల్ ద్వారా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పెద్దపల్లి జిల్లా నీటిని హైదరాబాద్ సిద్దిపేట నగరాలకు దొంగల్లాగా దోసుకుపోతున్నారు అన్నారు.సోనియా గాంధీ దేవత అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండన్న విషయాన్ని ప్రతి తెరాస పార్టి నాయకుడు గుర్తు చేసుకోవాలని విజయరమణారావు గుర్తుచేశారు.తెరాస ప్రభుత్వo 8 సంవత్సరాల పరిపాలనలో రైతుల, పట్ల రైతాంగ సమస్యలపైన తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిణి తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రైతులు పండించే పంటల విషయంలో రైతుల సంక్షేమం గురుంచివరంగల్ లో  రాహూల్ గాంధీ ఈ నెల అరవ తేదీన, హాజరవుతారన్నారు.  రైతు సంఘర్షణ భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తరలివచ్చి సంచలనం సృష్టించబోతున్నారు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాల నుండి వేలాది మందితో రైతు సంఘర్షణ సభకు తరలివెళ్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భూషవేన సురేష్ గౌడ్, మాజీ వైస్ ఛైర్మన్ నూగిల్ల మలయ్య,మండల అధ్యక్షుడు కడర్ల శ్రీనివాస్,నల్గొండ కుమార్,నేతట్ల కుమార్,భూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్,తూముల సుభాష్,సయద్ మస్రత్,బొడ్డుపల్లి శ్రీనివాస్, పుదరి చందు,అర్నగొండ రాజకుమార్,కొమ్మ శ్రీనివాస్,కరెంగుల రమేష్,ఆర్కుటి సంతోష్,నాంసాని శ్రీనివాస్, ఎంచర్ల తిరుమలేష్,వేముల రాజు,బొడ్డుపల్లి తిరుపతి,కిరణ్, మిట్టపెళ్లి శ్రీకాంత్, బొక్కల సంతోష్, అరె సంతోష్, తమ్మడవేన శ్రీనివాస్, శ్రావణ్, సంపత్ రావు, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.